డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో ధౌలీగంగా నదికి భారీగా వరద చేరుకుంది. వరద ప్రమాదస్థాయికి మించి ప్రవహించడంతో రిషిగంగా పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. వరద ప్రవాహంలో 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఎగువ నుంచి ప్రవాహ ఉధృతి కొనసాగుతుండడంతో ప్రయాగ్‌రాజ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. సహాయక చర్యల్లో 3200 మంది సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాద స్థలంలో ఏరియల్ సర్వే నిర్వహించామని సిఎం రావత్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ధౌలీ గంగా నది తీరా ప్రాంతాలలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఉత్తరాఖండ్ సిఎం రావత్, ఐటిబిపి డిజిపితో హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.
#WATCH | Uttarakhand: Rescue workers reach Reni village in Joshimath area of Chamoli district.
(Video credit – police) pic.twitter.com/pXdBubzUCj
— ANI (@ANI) February 7, 2021
#WATCH | A massive flood in Dhauliganga seen near Reni village, where some water body flooded and destroyed many river bankside houses due to cloudburst or breaching of reservoir. Casualties feared. Hundreds of ITBP personnel rushed for rescue: ITBP pic.twitter.com/c4vcoZztx1
— ANI (@ANI) February 7, 2021