Saturday, November 23, 2024

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన వంతెనలు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి.

మరోవైపు, భారీ వర్షాలకు నైనిటాల్‌ జిల్లా అతలాకుతలమైంది. వరద ఉద్ధృతికి నైనిటాల్‌ సరస్సు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు వరద పోటెత్తింది. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించారు.

Massive floods in Uttarakhand

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News