- Advertisement -
నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలులో ఆన్ లైన్ షాపింగ్ పేరుతో భారీ మోసం జరిగింది. గిఫ్ట్ కోసం షాపింగ్ చేస్తే గోనాయిస్ డాట్ కామ్ కంపెనీ రూ. లక్ష వసూలు చేసింది. బాధితురాలు వరుసగా పలుమార్లు ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసినట్టు తెలిపింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -