Friday, December 20, 2024

డిజిటల్ కరెన్సీ పేరుతో భారీ మోసం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన నిందితులను సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం…..బిఎన్ సతీష్, ఎపిలోని కడపకు చెందిన గుడిరాజు రాజేంద్ర ప్రసాద్ రాజు xcspl ఫైనాన్షియల్ అడ్వైజర్, పాశం వెంకట్ ప్రసాద్, ఆవలకొండప్ప వెంకట చలపతి, గురుప్రసాద్, జ్యోతి కలిసి మోసం చేశారు. ఇందులో రాజేంద్రప్రసాద్‌రాజు, వెంకటప్రసాద్, వెంకటచలపతిని పోలీసులు అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. బిఎన్ సతీష్, చలపతి కలిసి క్సిటో కన్సల్‌టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2015లో బెంగళూరులో ఏర్పాటు చేశారు.

మిగతా వారితో కలిసి దాని బ్రాంచ్‌ను కెపిహెచ్‌బిలో ఏర్పాటు చేశారు. తాము చెప్పిన డిజిటల్ కరెన్సీలో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని పలువురుకి చెప్పారు. మూడు నెలల్లో 1ః1, ఏడాదిలో 1ః4లో లాభాలు వస్తాయని చెప్పారు. దీనిని నమ్మిన తెలంగాణ, ఎపికి చెందిన బాధితులు 500మంది దాదాపుగా రూ.10కోట్లను డిపాజిట్ చేశారు. డబ్బులు డిపాజిట్ చేసిన వారికి ఎక్స్ కాయిన్స్ ఇచ్చారు. తమకు చెప్పిన గడువు ముగియడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి నిందితులు స్పందించడం మానివేశారు.

ఈ క్రమంలోనే డబ్బులు డిపాజిట్ చేసిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి తాను డిపాజిట్ చేసిన రూ.6,50,000 తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News