Saturday, November 16, 2024

సాలు మోడీ… సంపకు మోడీ

- Advertisement -
- Advertisement -

బైబై మోడీ హ్యాష్‌ట్యాగ్‌తో
హైదరాబాద్‌లో వెలిసిన
ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు
సోషల్ మీడియాలోనూ
ఇదే అంశంపై రచ్చ..రచ్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : సాలు మోడీ… సంపకు మోడీ, బై బై మోడీ అంటూ ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నగరంలో పెద్దఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. వచ్చే నెల 2,3 తేదీలలో బిజెపి నిర్వహిస్తున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. అయితే మోడీ రాకను నిరసిస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. అవి ప్రధానంగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం విశేషం.

బైబై మోడీ అనే హాష్ ట్యాగ్‌తో టివోలీ థియేటర్ ఎదురుగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో రాష్ట్ర విభజన హామీలు ఏమయ్యాయి? నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఏమయిందని ప్రశ్నించారు. అలాగే రైతు చట్టాలు తెచ్చి…. రైతులను చంపినావు, అగ్నిపథ్‌లో నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినావ్…. కరోనా పేరుతో హఠాత్తుగా దేశంలో లాక్‌డౌన్‌ను విధించి గరీబోల్లను చంపినావు…, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేశావు…. పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావు అంటూ ఆయా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై మోడీని ప్రశ్నించారు. అలాగే నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయి? అంటూ మోడీ నిలదీస్తూ వాటిని ఏర్పాటు చేశారు. గత నెలలో కూడా హైదరాబాద్‌లోని ఎస్‌బిఐకు వచ్చారు.

ఈ సందర్భంహా కూడా మోడీకి వ్యతిరేకంగా ఇలాంటి ఫెక్సీలు, హోర్డింగ్స్ వెలిసిన విషయం తెలిసిందే. పైగా ఆ ఫ్లెక్సీల్లో ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నిస్తూ….మొత్తం 17 ప్రశ్నలతో కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే రిజైన్ మోడీ, బై బై మోడీ, స్టెప్ డౌన్ మోడీ ఇలాంటి హ్యాష్ ట్యాగ్ లతో మోడీ వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇవి జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై రచ్చ…రచ్చ సాగుతోంది. కాగా మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన ఫ్లెక్సీలపై బిజెపి నాయకులు తీవ్ర అసంత-ప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని వెంటనే తొలగించాలంటూ సంబంధిత అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ప్రభుత్వ పథకాల జోరు….

మోడీకి వ్యతిరేకంగా పలు కూడళ్లలో ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ వెలువగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు….వాటి వల్ల కలిగిన ప్రయోజనం తదితర అంశాలను ప్రస్తావిస్తూ నగరమంతా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశాయి. పెద్ద పెద్ద హోర్డింగ్‌ల నుంచి మొదలుకుని చిన్న చిన్న కూడళ్లను కూడా వదిలిపెట్టకుండా ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని అన్ని బస్సుస్టాప్‌లు, మెట్రోపిల్లర్లలో ఎక్కడ చూసినా సిఎం కెసిఆర్ ఫోటోలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల జాతరను తలపించే రీతిలో ఫెక్సీలు, హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News