హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూఫ్రాన్‌కు చెందిన మత్స కారులు మంత్రికి కొర్రమీను చేపలపను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేపపిల్లలను వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మత్సకారుల ఆదాయం భారీగా పెరిగిందని, ఇది ఎంతో ఆనందాన్నిస్తోందని అన్నారు. ప్రతి సంవత్సరం మృగశిరకార్తె రోజున మంత్రికి కొర్రమీను చేపలను అందిస్తున్నట్లు ఈ సందర్భంగా మత్సకారులు తెలిపారు. మత్సకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో శాడా కోటేశ్వరరావు, గడప దేవేందర్, గరిగే సంపత్ తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో భారీగా పెరిగిన మత్స్య సంపద : తలసాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -