Sunday, December 22, 2024

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

- Advertisement -
- Advertisement -

జిల్లేడుచౌదరిగూడెం: మండల పరిదిలోని గుర్రంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 150 మంది పలు పార్టీల కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం ఎంపిపి సన్వల్లి యాదమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

మండల పార్టీ అధ్యక్షుడు చలివేంద్రంపలి రాజు, నాయకులు దస్తగిరి సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకున్నారు. ఈ సందర్బంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్ట్టీ ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పలేదని ఆయన అన్నారు. బూటకపు మాటలు చెప్పి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వాపోయారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 500కే వంటగ్యాస్‌తోపాటు, రుణమాఫీ,ఉద్యోగాల కల్పనతో పాటు చేయూత పథకం ద్వారా రూ. 4వేలు పెన్షన్ అందిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరిన వారు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News