Sunday, November 3, 2024

పాక్ సరిహద్దు అడవిలో 20 రోజులుగా భారీ ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

Massive operation enters 20 days in Pak border forest

రెండుసార్లు ఎదురుపడ్డ ఉగ్రవాదులు
9మంది సైనికులు, ఓ ఉగ్రవాది మృతి

జమ్ము: పాకిస్థాన్ సరిహద్దున జమ్మూకాశ్మీర్‌లోని దట్టమైన అడవిలో ఉగ్రవాదుల కోసం సైన్యం చేపట్టిన ఆపరేషన్ శనివారానికి 20వ రోజుకు చేరుకున్నది. ఈ ఆపరేషన్ సందర్భంగా రెండు వేర్వేరు ఘటనల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 9మంది సైనికులు మృతి చెందినట్టు ఓ అధికారి తెలిపారు. పూంచ్ జిల్లా సురాన్‌కోట్ అటవీ ప్రాంతంలో, రాజౌరీ జిల్లా తనమండి అటవీ ప్రాంతంలో అక్టోబర్ 11న ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం కోట్ భల్వాల్ సెంట్రల్ జైలులో ఉన్న పాక్ ఉగ్రవాది ఒకరిని ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతానికి తీసుకెళ్లగా, అక్టోబర్ 24న అడవిలో నక్కి ఉన్న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు.

ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. అక్టోబర్ 11న సురాన్‌కోట్‌లో, 14న భట్టీదురియన్‌లో ఎదురుపడ్డారు. ఈ రెండు ఘటనల్లో వరుసగా ఐదుగురు, నలుగురు చొప్పున సైనికులు మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో ఒక ఎకె రకం రైఫిల్, కొంత మందుగుండు, ఇతర సామగ్రిని సైన్యం జప్తు చేసింది. దట్టమైన అడవిలో ఉగ్రవాదులను కనిపెట్టడం క్లిష్టంగా ఉన్నదని ఓ అధికారి తెలిపారు. ఉగ్రవాదుల కోసం అడవి మొత్తం జల్లెడ పడుతున్నామన్నారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో ఆ ప్రాంతంలోని దాదాపు 12మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతంలో పౌరుల రాకపోకలను నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News