పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై సోమవారం మంచు కురుస్తున్న కారణంగా అనేక వాహనాలు ప్రమాదాలకు గురికావడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని, పలువురు గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తెలిపింది. ట్రక్కులు, ట్రాక్టర్-ట్రైలర్లు, కార్లతో సహా హైవేపై ఢీకొన్న వాహనాల సంఖ్య 50 నుంచి 60 మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో మంచుతో కూడిన రహదారిపై… నియంత్రణ కోల్పోయిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లు కనిపిస్తోంది. క్రాష్ తర్వాత కొన్ని వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి, తరువాత వాటిని ఆర్పివేశారు. సోమవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మంచు విపరీతంగా కురుస్తున్న కారణంగా దాదాపు ముందున్నవి కనిపించని పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు.
హైవేపై అనేక మైళ్ల వరకు పేరుకుపోయిన మంచు ట్రాఫిక్‌ను స్తంభింపజేసింది. ఎమర్జెన్సీ రెస్పాండర్లు, రెస్క్యూవర్లు సైట్‌కు చేరుకోవడం కష్టతరంగా మారింది. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్గు కొనసాగుతోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు, షుయ్‌కిల్ కౌంటీలో ఒక నెలలో ఇది రెండవ పెద్ద పైలప్(మంచుపేరుకుపోవడం) అని అధికారులు తెలిపారు.