హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్18లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కో సం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు. మంగళవారం ఐపిఎల్ ఏర్పాట్లపై ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యంతో హెచ్‌సిఎ అపె క్స్ కౌన్సిల్ సభ్యుల సమీక్షా సమావేశంలో ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని, అభిమానులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
కిందటిసారి కార్పొరేట్ బాక్సుల్లో ని ఎసిలు, వాష్‌రూమ్‌లు సరిగ్గా పనిచేయలేదన్నారు. ఈసారి అలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలన్నారు. టిక్కెట్ల విక్రయాల్లో పారదర్శకత పాటించాలని, బ్లాక్‌లో అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విక్రయించే ఆహార పదర్థాల నాణ్యత బాగుండాలని, అధిక ధరలకు అమ్మకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సిఎ ప్రతినిధులు దల్జిత్ సింగ్, బసవరాజు, సిజె శ్రీనివాస్, సునీల్ అగర్వాల్, ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు శరవణన్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.