- Advertisement -
న్యూఢిల్లీ: ముస్లింలకు ఆరాధనీయుడు అయిన ముహమ్మద్(స)పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బిజెపి మాజీ ప్రతినిధి నూపుర్ శర్మ, ఆమె సహచరుడు నవీన్ కుమార్ జిందాల్ ఇప్పటికీ అరెస్టు కాకపోవడంపై న్యూఢిల్లీలో, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన షహరన్ పూర్ లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీలోని జామా మస్జిద్ లో శుక్రవారం నమాజు ముగిశాక నిరసన ప్రదర్శన జరిగింది. నూపుర్ శర్మ, జిందాల్ మీద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా టివి చర్చలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా నిరంతర అగౌరవపరచడానికి వ్యతిరేకంగానే తాను ప్రవక్త(స)పై వ్యాఖ్య చేయాల్సి వచ్చిందని నూపుర్ శర్మ ఆదివారం ట్విట్టర్లో రాశారు.
- Advertisement -