Saturday, November 23, 2024

నేడు ఖమ్మంలో రైతు గోస.. బిజెపి భరోసా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో రైతు గోస.. బిజెపి భరోసా సభను నిర్వహిస్తున్నది. అదివారం జరిగే సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని.. రైతులకు బిజెపి ఏం చేస్తుందో ప్రకటించనున్నారని రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కాగా అమిత్ షా పర్యాటనలో స్వల్ప మార్పులు జరిగాయి. భద్రాచలం కార్యక్రమం రద్దు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటాడు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు షా రానున్నారు.

అనంతరం బీజేపీ రాష్ట్రకోర్ కమిటీ, ముఖ్యనేతలతో ఆయన భేటీ అవుతారు. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ & బిడిఎన్‌ఆర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు జరిగే భారీ బహిరంగ సభకు బిజెపి నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. హోంమంత్రితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, డాక్టర్ కె. లక్ష్మణ్, డి.కె అరుణ తదితరులు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News