Wednesday, January 22, 2025

గద్వాలలో భారీ దొంగతనం

- Advertisement -
- Advertisement -

ఇంటికి తాళం వేసి బెంగుళూరుకు ఫంక్షన్‌కి వెళ్తే ఇంటిని దోచేసిన ఘటన గద్వాల జిల్లా గద్వాల టౌన్‌లోని లింగం బాగ కాలనీలో గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు రాజేష్ వివరాల మేరకు గద్వాల టౌన్ మెయిన్ రోడ్‌లో షాపు నిర్వహించే ఇంగూరు వెంకటేశ్వర్లు దంపతులు శుభకార్యానికి ఈనెల 26వ తేదిన ఇంటికి తాళం వేసి బెంగుళూరుకు వెళ్లారు. ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండగా ఆయన కుమారుడు రాజేష్ మాత్రమే గురువారం తెల్లవారుజామున గద్వాలకు వచ్చి ఇల్లు తెరిచేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే తాళం పగలగొట్టి ఉన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఇంట్లో ఉన్న 40 తులాల బంగారం, 10 లక్షల నగదు, దొంగతనానికి గురైనట్లు తెలిపారు. ఇంటి యజమాని వస్తే ఎంత మేరకు చోరీకి గురై వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంట్లో ఉన్న మరో లాకర్ తెరవకపోవడంతో దాంట్లో కూడా పెద్ద ఎత్తున బంగారు, నగదు ఉందనే అనుమానాలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గద్వాల టౌన్ ఎస్‌ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News