Friday, December 20, 2024

నాగాలాండ్‌లో ఘోర ప్రమాదం..(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

కోహిమా: నాగాలాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి నుంచి నాగాలాండ్‌లో భారీ వర్షం కురుస్తోంది.ఈ క్రమంలో తెల్లవారుజామున నాగాలాండ్‌లోని దిమాపూర్‌లోని చుమౌకెడిమాలో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో కొండచరియలు విరిగిపడిపోయాయి. పెద్ద పెద్ద బండరాలు రోడ్డుపై ఆగి ఉన్న కారులను ఢీకొట్టాయి.

ఈ ఘటనలో పలు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

courtesy by hindustan times

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News