- Advertisement -
హైదరాబాద్: మేడారం జాతరకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు 9 వేల మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారు. 400 సిసి కెమెరాలతో నిత్యం పహారా ఉంటుందని చెప్పారు. క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేశామని, 33 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని వివరించారు. 37 చోట్ల పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు గుర్తించామని, ప్రతి రెండు కిలో మీటర్లకు పోలీస్ అవుట్ పోస్టులు ఉంటాయని, 50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. జాతర ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద అధునాతన రీతిలో భద్రతా ఉంటుందన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా నిత్యం సిసి కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు.
- Advertisement -