Monday, December 23, 2024

సమర శంఖం

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రభుత్వంపై పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామిక యుద్ధభేరి

విపక్షాల సిఎంలతో ఫోన్‌లో చర్చలు.. జాతీయస్థాయి
ప్రతిపక్ష నేతలతో మంతనాలు సానుకూల స్పందన
కలిసొచ్చే శక్తులతో వ్యూహాలు ఫెడరల్, సెక్యూలర్
ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ధ్యేయం

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించనున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్య తిరేకంగా కలిసి వచ్చే అన్ని విప క్ష పార్టీలను సమన్వయం చేసుకుని పోరుబాటకు శ్రీకారం చు ట్టనున్నారు. ప్రస్తుతం వరదల నుంచి రాష్ట్రాన్ని ఒకవైపు కాపాడుకుంటూనే మరోవైపు బిజెపి అప్రజాస్వామిక విధానాల విప త్తు నుంచి దేశాన్ని కాపాడేందు కు పార్లమెంట్ వేదికగా పోరా టం చేసేందుకు అందరిని సన్న ద్ధం చేస్తున్నారు. దీనికి ఈ నెల 18 ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకోవాలని నిర్ణయించా రు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు ముఖ్యమంత్రులతో సి ఎం కెసిఆర్ ఫోన్‌లో చర్చలు జ రిపారు. అలాగే జాతీయ నేతలతోనూ కెసిఆర్ మంతనాలు సా గించారు. ఇప్పటికే పశ్చిమ బెం గాల్ ముఖ్యమంత్రి మమతా బె నర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ము ఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితుల తో, బిహార్ ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్, యుపి ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్ తో, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో పాటు పలువురు జాతీయ విపక్ష నేతలతో సిఎం కెసిఆర్ స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు మద్దతు పలికాలని ఈ సందర్భంగా వారిని కోరారు.

సానుకూల స్పందన
కేంద్రంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతున్న కెసిఆర్‌కు పలు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. మోడీ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా కెసిఆర్ చేసిన ప్రతిపాదనలకు పలువురు ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలతను వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మోడీ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించేందుకు ఇదే అసలైన సమయమని…..మీరు(కెసిఆర్) చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కెసిఆర్‌కు హామి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News