Sunday, April 6, 2025

నగరంలో భారీ చోరీ…

- Advertisement -
- Advertisement -

Massive theft in Hyderabad

 

హైద‌రాబాద్ : నగరంలో భారీ చోరీ చోటుచేసుకుంది. మాదాపూర్ లోని కావూరిహిల్స్‌లో ఓ వ్యాపారి ఇంట్లో రూ. 30 ల‌క్ష‌ల విలువైన బంగారం, రూ. 20 ల‌క్ష‌ల న‌గ‌దుతో పాటు అమెరిక‌న్ డాల‌ర్ల‌ను దొంగ‌లు అప‌హ‌రించారు. వ్యాపారి వాసుదేవ‌రెడ్డి ఇంటికి తాళం వేసి ఓ వేడుకకు వెళ్లి తిరిగొచ్చేసరికి ఈ దొంగ‌త‌నం జ‌రిగింది. తాను ఇంటికి తిరిగొచ్చే స‌రికి.. త‌లుపులు తెరుచుకోవ‌డంతో అనుమానం వ‌చ్చి ఇంటిని నిశితంగా ప‌రిశీలించాడు. ఇంట్లో ఉన్న బంగారం, న‌గ‌దు చోరీ అయిన‌ట్లు గుర్తించాడు వాసుదేవ‌రెడ్డి. దీంతో వాసుదేవ‌రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News