Sunday, January 19, 2025

హైదరాబాద్‌లో భారీగా ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 163మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో అబిడ్స్, బంజారాహిల్స్ ట్రాఫిక్, చిక్కడపల్లి, ఆసిఫ్‌నగర్, నాంపల్లి ట్రాఫిక్, గాంధీనగర్, మంగళ్‌హాట్, బేగంపేట, ఓయూ, మహంకాళీ, నాపంల్లి, లంగర్‌హౌస్, బండ్లగూడ, కామాటిపుర, ఫలక్‌నూమా ట్రాఫిక్, నల్లకుంట,

ఖైరతాబాద్, లేక్ పిఎస్, తిరుమలగిరి, చార్మినార్, మాసబ్‌ట్యాంక్, హబీబ్‌నగర్, అఫ్జల్‌గంజ్, షాహినాయత్‌గంజ్, హుమాయున్‌నగర్, కంచన్‌బాగ్, మొఘల్‌పుర, రేయిన్‌బజార్, హుస్సేనీఆలం, భవానీనగర్, గుడిమల్కాపూర్, ఉమెన్ పోలీస్ స్టేషన్, మలక్‌పేట్, బొల్లారం ఎస్‌హెచ్‌ఓలను బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో చేరాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఏర్పడిన కొత్త పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలను కూడా బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News