Monday, December 23, 2024

తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -
22 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
పలువురికి దక్కిన పదోన్నతి

హైదరాబాద్: తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురికి పదోన్నతులను కల్పిస్తూ జిహెచ్‌ఎంసితో పాటు పలు జిల్లాల కమిషనర్‌లుగా ప్రభుత్వం నియమించింది. సిడిఎంఏ నుంచి జీహెచ్‌ఎంసికి బి.గీతను బదిలీ చేసింది. ఆమె స్థానంలో జాయింట్ డైరెక్టర్‌గా టి.కృష్ణమోహన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. బడంగ్‌పేట మున్సిపల్ కమిషనర్‌గా బి.సుమన్‌రావు, రామగుండం కార్పొరేషన్ కమిషనర్‌గా సిహెచ్ నాగేశ్వర్‌ను, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్‌కు పదోన్నతి కల్పిస్తూ తుర్కయాంజల్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా కె.నారాయణరావుగా బదిలీ చేయగా, దమ్మాయిగూడ కమిషనర్ స్వామికి పదోన్నతి కల్పిస్తూ పాల్వంచ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మిర్యాలగూడ కమిషనర్ పి.రవీంద్ర సాగర్‌కు పదోన్నతి కల్పిస్తూ ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా బదిలీ చేసింది. బి.రాజేంద్ర కుమార్ నాగారం కమిషనర్‌గా, పోచారం అసిస్టెంట్ కమిషనర్ ఎ. సురేష్‌ను జీహెచ్‌ఎంసికి, ఎండి సాబీర్ అలీని ఘట్‌కేసర్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
ఇబ్రహీంపట్నం కమిషనర్ పదోన్నతిపై జిహెచ్‌ఎంసికి….
ఎంపి పూర్ణచంద్రారెడ్డిని మిర్యాలగూడకు, ఎస్.రవీందర్ రెడ్డిని పెద్దఅంబర్‌పేట్‌కు, బి.సత్యనారాయణరెడ్డిని ఖమ్మంకు, కె.వేణుమాధవ్‌ను నందికొండకు, పి.వేమనరెడ్డి పోచారం కమిషనర్‌గా బదిలీ అయ్యారు. వీరితో పాటు ఆర్.త్రయంబకేశ్వర్‌ను రామగుండం డిప్యూటీ కమిషనర్‌గా, ఎస్.రాజమల్లయ్యను దమ్మాయిగూడ కమిషనర్‌గా, ఇబ్రహీంపట్నం కమిషనర్ మహ్మద్ యూసుఫ్‌ను పదోన్నతిపై జీహెచ్‌ఎంపికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్.రాజశేఖర్‌ను హుస్నాబాద్‌కు, ఎ.వెంకటేశ్‌ను కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News