Saturday, December 21, 2024

బీహారీ ఝానే ప్రధాన సూత్రధారి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో దూకుడు ఘటనలకు పాల్పడ్డ గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారని వెల్లడైంది. వీరిలో నలుగురు పట్టుబడ్డారు. కాగా ఐదవ వ్యక్తి విక్కి శర్మను ఆయన భార్యను గురుగావ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు తరచూ వీరి నివాసంలోనే కలుసుకుంటూ వచ్చారని విచారణ క్రమంలో వెల్లడైంది. అయితే బీహార్‌కు చెందిన లలిత్ ఝా ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అని, తెరవెనుక ఉంటూ కథ నడిపించాడని, ఇప్పుడు ఫరారీలో ఉన్నాడని వెల్లడైంది. ఝా ఇటీవలి వరకూ కోల్‌కతాలో టీచర్‌గా ఉన్నారు. ఆయన చివరిగా రాజస్థాన్‌లోని నిమ్రానాలో కనబడినట్లు గుర్తించారు. పార్లమెంట్ ఘటన తరువాత ఈ వ్యక్తి జాడలేకుండా పోయింది.

దాడి దశలో పార్లమెంట్‌లోనే ఝా
దాడి దృశ్యాలను వైరల్ చేసి ఫరారు?
బుధవారం పార్లమెంట్‌లో సంచలనానికి దిగిన సమయంలో ఝా పార్లమెంట్‌లోపలనే ఉన్నట్లు వెల్లడైంది. విజిటర్స్ పాస్ దొరకకపోవడంతో లోపల అటూ ఇటూ సంచరించాడు. తరువాత తమ బృందం వారు జరిపిన దాడిని తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చి , క్షణాలలోనే పారిపోయినట్లు ఇప్పుడు దర్యాప్తు క్రమంలో తేలింది. పారిపోతూ తమ బృందంలోని వారి చేతుల్లోని సెల్‌ఫోన్లను కూడా లాక్కుని వెళ్లినట్లు నిర్థారణ అయింది. ఈ ఫోన్లలో అత్యంత కీలక సమాచారం ఉన్నట్లు, దీనిని ఆయన చెరిపేసేందుకు వీలుందని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో కలకలం కోసం ఈ బీహారీనే వ్యూహరచనకు దిగినట్లు గుర్తించారు.

సాంకేతిక పరిజ్ఞానంలో దిట్టగా ఉంటూ విద్యావంతులైన వారిని తన ఆపరేషన్ పార్లమెంట్‌కు వాడుకున్నట్లు వెల్లడైంది. ట్రిమ్ గడ్డం, ఎప్పుడూ లాల్చీ పైజామాతో ఉండే ఝా డిసెంబర్ 13వ తేదీని నిర్థిష్టంగా తమ దాడికి సమయంగా ఖరారు చేశారు. గతంలో ఇదే రోజున పార్లమెంట్‌పై దాడి జరిగింది. రక్తపాతానికి దారితీసింది. ఫరారీలో ఉన్న ఝా తనకు స్ఫూర్తిగా షహీద్ భగత్‌సింగ్‌ను ఎంచుకున్నారు. తన గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేయాలని ఈ చర్యకు దిగాడని వెల్లడైంది. పార్లమెంట్‌లోపలికి మొత్తం ఆరుగురు ప్రవేశించారని, వీరిలో నలుగురికే ఎంపిల పాస్‌లు పొందారు. మిగిలిన నలుగురు బయటనే ఉండి తమ నిర్ణీత చర్యకు దిగారని వెల్లడైంది. మనోరంజన్ అనే దుండగుడు ఏ విధంగా విజిటర్స్ పాస్ పొందాడనేది వెల్లడికాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News