Sunday, December 22, 2024

మాతా అమృతానందమయి దేవికి “శాంతిభద్రతల ప్రపంచ నాయిక ’ అవార్డు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త మాతా అమృతానందమయి దేవి “2023 శాంతిభద్రతల ప్రపంచ నాయిక”( వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ) అవార్డుకు ఎంపికైంది. బోస్టన్ గ్లోబల్ ఫోరమ్ (బిజిఎఫ్), మైకేల్ డుకాకిస్ ఇనిస్టిట్యూట్ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఇన్నొవేషన్ (ఎండిఐ) ఈ అవార్డును నెలకొల్పాయి. అమ్మగా బహుళ ప్రజాదరణ పొందిన అమృతానందమయి ప్రపంచశాంతికి, ఆధ్మాత్మికతకు, ప్రేమానురాగాలతో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందిస్తున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి. జైపూర్‌లో సి 20 సదస్సు సందర్భంగా జులై 31న మొదట ఈ మేరకు ప్రకటించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News