Friday, December 20, 2024

టీ20 వరల్డ్‌కప్‌లో ఫిక్సింగ్ కలకలం!

- Advertisement -
- Advertisement -

గయానా: వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టి20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కలకలం సృష్టించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం కెన్యాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ ఉగాండా జట్టు సభ్యుడిని సంప్రదించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఉగాండా క్రికెటర్ వెంటనే ఐసిసి అవినీతి నిరోధక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ వరల్డ్‌కప్‌లో ఉగాండా టీమ్ మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే.

కాగా, కెన్యాకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ ఒకరు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఉగాండా క్రికెటర్లను వేర్వేరు నంబర్లతో పలు సార్లు సంప్రదించడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సంబంధిత క్రికెటర్ ఐసిసి దృష్టికి తీసుకెళ్లాడు. ఇదిలావుంటే ఫిక్సింగ్ అంశం తెరపైకి రావడంతో ఐసిసితో సహా ఇతర జట్ల క్రికెట్ బోర్డులు షాక్‌కు గురయ్యాయి. మరోవైపు ఈ విషయంపై విచారణ జరపాలని ఐసిసి అధికారులు నిర్ణయించారు. వరల్డ్‌కప్‌లో గ్రూప్‌సిలో ఉన్న ఉగాండా నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక విజయాన్ని సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News