Sunday, March 9, 2025

భారత్‌తో పోరు సవాల్ వంటిదే : కేన్ విలియమ్సన్

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగే ఫైనల్ పోరు తమకు సవాల్ వంటిదేనని న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. దుబాయి పిచ్‌పై టీమిండియాకు మంచి అవగాహన ఏర్పడిందన్నాడు. భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయిలోనే ఆడడం వారికి కలిసి వచ్చే అంశమన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత్‌ను ఓడించాలంటే తాము సర్వం ఒడ్డి పోరాడక తప్పదన్నాడు. ప్రపంచంలోనే టీమిండియా పటిష్టమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆ జట్టుతో పోరు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ఫైనల్‌కు చేరిందన్నాడు. ఇలాంటి స్థితిలో టీమిండిచా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్ బరిలోకి దిగుతుందన్నాడు. ఆ జట్టును ఓడించాలంటే తాము అసాధారణ ఆటను కనబరచాల్సి ఉంటుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News