Sunday, December 22, 2024

ఢిల్లీ వీధుల్లో మాతేశ్వరి ఘట ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల రెండవ రోజైన మంగళవారం సాయంత్రం ఇండియా గేటు నుండి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తెలంగాణ భవన్‌కు తీసుకొని వచ్చి ప్రతిష్టించారు.

ఇండియా గేట్ వద్ద భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉత్పల్, ఆలయ అధ్యక్షుడు రాజేందర్ యాదవ్‌లు జాతీయ జెం డాతో ఊరేగింపును ప్రారంభించారు. ఢిల్లీ వీధుల్లో బ్యాండు మోతలు, పోతరాజు నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు, జాతీయ జెండా రెపరెపలు ఆకట్టుకున్నాయి. దారి పొడవున ఢిల్లీ వాసులు, పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఊరేగింపును తిలకించారు. తెలంగాణ భవన్‌లో మాతేశ్వరి ఘటానికి రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉత్పల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్‌దర్వాజా మహంకాళి ఆలయ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు.

దీంతో తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజా బోనాల శోభ ఉట్టి పడింది. భవన్ ప్రధాన గేటుకు, దారి పొడవున ప్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ ఊరేగింపులో ఆలయ ప్రధాన కార్యదర్శి బి.మారుతీ యాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్, ఢిల్లీ బోనాల కన్వీనర్ జి.అరవింద్ గౌడ్, మాజీ చైర్మన్లు విజయ కుమార్, కాశీనాథ్ గౌడ్, సి.వెంకటేష్ ముదిరాజ్, మాణిక్ ప్రభు గౌడ్, రాజ్ కుమార్ యాదవ్, లక్ష్మీనారాయణ గౌడ్, పోసాని సురేందర్ ముదిరాజ్, కె.వెంకటేష్, సభ్యులు రమేష్, హేమానంద్, సుధాకర్, వినోద్, రఘు యాదవ్, చందు, నగేష్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా మూడవ రోజైన బుధవారం ఉదయం 11 గంటలకు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొనుట, ప్రత్యేక పూజలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, బంగారు బోనం సమర్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు అంబేద్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమంతో మూడు రోజుల ఢిల్లీ బోనాలు ముగుస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News