Saturday, December 21, 2024

ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సిఆర్ రావు ఇకలేరు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సిఆర్ రావు(102) కన్నుమూశారు. అమెరికాలో డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణారావు తుదిశ్వాసవిడిచారు. 1968లో పద్మ భూషణ్, 2001లో పద్మవిభూషణ్, ఎస్‌ఎస్ భట్నాగర్ పురస్కారాలను సహితం అందుకున్నారు. 1920లో కర్నాటకలోని హడగల్లి ప్రాంతంలో తెలుగు కుటుంబంలో రావు జన్మించారు. ఆయన గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో చదువుకున్నారు. 1943లో ఎంఎస్ మ్యాథ్స్ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు. కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఎలో స్టాటిస్టిక్స్ చేశారు. యుకెలో పిహెచ్‌డి చదివారు. స్టాటిస్‌టిక్స్ రంగంలో నోబెల్ బ‌హుమ‌తిగా కీర్తించ‌బ‌డే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయ‌నను వరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News