- Advertisement -
ప్రపంచ కప్ వన్డే టోర్నమెంటులో సోమవారం విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ఆలస్యంగా క్రీజులోకి రావడంతో అంపైర్ టైమ్డ్ ఔట్ గా ప్రకటించాడు. దాంతో ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే మాథ్యూస్ వెనుదిరిగాడు.
బంగ్లా కెప్టెన్ షకీబ్ వేసిన బంతికి లంక బ్యాటర్ సమర విక్రమ అవుటయ్యాడు. అతని స్థానంలో వచ్చేందుకు మాథ్యూస్ మైదానంలోకి అడుగుపెట్టాడు. సరిగ్గా అప్పుడే అతని హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది. దాంతో మరో హెల్మెట్ కోసం డ్రెస్సింగ్ రూమ్ కు సంకేతమిచ్చాడు. ఈ గందరగోళంలో అతను క్రీజులోకి రావడం ఆలస్యమైపోయింది. వెంటనే బంగ్లాదేశ్ జట్టు టైమ్డ్ ఔట్ కోసం అప్పీలు చేయడంతో, అంపైర్ మాథ్యూస్ ను ఔట్ గా ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా ఒక బ్యాటర్ టైమ్డ్ ఔట్ కావడం ఇదే మొదటిసారి.
- Advertisement -