Wednesday, January 22, 2025

మత్తు వదలరా 2 సినిమా విజువల్స్ అద్భుతం: రాజమౌళి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘మత్తు వదలరా’ సినిమాకు సీక్వెన్స్‌గా ‘మత్తు వదలరా 2’ను తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీసింహ, రితేశ్ రానా నటించారు. మత్తు వదలరా 2 సినిమా టీజర్ లాంచ్ చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సీక్వెల్ టీజర్‌పై స్పందించారు. మత్తు వదలరా 2 మా బాయ్స్ వస్తున్నారని, టీజర్‌లో డైలాగ్స్ సూపర్‌తో పాటు ఫన్నీగా ఉన్నాయని ప్రశంసించారు. విజువల్స్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయన్నారు. సెప్టెంబర్ 13న టికెట్లను తస్కరించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ టీచర్‌లో మరో డైలాగ్‌ను హీ… హీ… హీ… హీ టీమ్ అంటూ స్మైలీ ఎమోజీలను పోస్టు చేశారు. రాజమౌళి తన ట్విట్టర్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News