హైదరాబాద్‌లోని మధురానగర్‌లో
ఘటన పోలీసుల అదుపులో
ఒకరు, పరారీలో మరో ఇద్దరు
నిందితులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: మహిళపై సా మూహిక అత్యాచారం జరిగిన సంఘటన మ ధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవా రం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్‌పూర్‌కు చెందిన రఫీక్, చోటు, చందూ అనే యువకులు నగరంలోని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కార్మినగర్‌లోని, ఓంనగర్ లో ఉంటూ పెయింటింగ్ పని చేస్తున్నారు. హౌస్ కీపింగ్ పనిచేసే మహిళ (50) రోజు సాయంత్రం హైటెక్ సిటీ క్రాస్ రోడ్డు వద్ద బస్ కోసం వేచి చూసేది. నిందితులు రోజు ఇంటికి వస్తుండగా మహిళను గమనించేవారు.
రోజు మాదిరిగానే యువకులు సోమవారం కొండాపూర్ ఏరియాలో పనికోసం వెళ్లారు. ఉద యం పనికోసం వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి వచ్చేందుకు బస్‌స్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. ఎప్పటి నుంచో ఆమెపై క న్నేసిన ముగ్గురు కామాంధులు ఆటోలో ఆమె వద్దకు వచ్చారు. తమ ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందని డబ్బులు ఇస్తామని మహిళకు నిందితులు మాయ మాటలు చెప్పారు. బట్టలు ఉతికితే డ బ్బులు వస్తాయని ఆశ పడిన మహిళ వారితో ఆటోలో బయలుదేరింది. మహిళను తీసుకుని నిందితులు తాము ఉంటున్న ఓంనగర్‌కు వచ్చారు.
ఆ తర్వాత మహిళ నోటిలో గుడ్డలు కుక్కి ముగ్గు రు అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు మహి ళ కేకలు వేయడంతో పక్కింటి మహిళ వచ్చి తలుపు కొట్టి తీయ గా, బాధితురాలు రూము నుంచి బయటికి పరిగెత్తింది. వెంటనే అక్కడే ఉన్న మహిళలు బాధితురాలికి దుస్తులు ఇచ్చారు. అనంత రం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించా రు. పరారైన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు మధురానగర్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసుల అదుపులో ఓ నిందితుడు ఉన్నట్లు తెలిసింది. ఇ దిలాఉంటే మహిళపై అత్యాచారం జరిగిన గదిని పోలీసులు సీజ్ చేశారు. నెలక్రితమే నిందితులు రూమ్‌ను అద్దెకు తీసుకుని ఉం టున్నట్లు తెలిసింది. నిందితులు రోజు మద్యం తాగేవారని, గొడవలు పడేవారని స్థానికులు తెలిపారు.