Monday, January 27, 2025

భారీ పోరాటాల్లో ‘మట్కా’

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ పాన్-ఇండియన్ మూవీ ‘మట్కా‘తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అ వుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తు న్న ఈ మూవీని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ డా. విజయేందర్ రెడ్డి తీగల ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గ్రాండ్ స్కేల్ లో రూపొందుతోంది. ప్రస్తు తం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం నిర్మించిన మాసీవ్ సెట్‌లో ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తున్నారు.

సినిమాలో చాలా కీలకంగా వుండే ఈ ఫైట్ సీక్వెన్స్ విజయ్ మాస్టర్ సూపర్ విజన్‌లో చాలా మాసీవ్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం వరుణ్ తేజ్ చాలా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ హైవోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో ఒక మేజర్ ఎట్రాక్షన్‌గా ఉండబోతోంది. వర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ ’మట్కా’లో మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ మాసీవ్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News