Wednesday, January 22, 2025

మట్కా నుంచి రామ టాకీస్ సాంగ్ విడుదల… అదిరిపోయింది

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’మట్కా’ ఈనెల 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం మేకర్స్ ‘రామ టాకీస్’ ర్యాంప్ సాంగ్ రిలీజ్ చేశారు.

భవానీ రాకేష్ అదిరిపోయే బీట్స్‌తో ఫోక్ నెంబర్‌గా ఈ పాటని కంపోజ్ చేశారు. డైరెక్టర్ కరుణ కుమార్ స్వయంగా రాసిన జానపద సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరో వరుణ్ తేజ్‌తో పాటు సినిమాలోని కీలక నటీనటులు, స్పెషల్ సెట్స్, షూటింగ్ లోకేషన్స్‌ని చూపించిన ఈ సాంగ్ మేకింగ్ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విన్న వెంటనే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News