Wednesday, January 22, 2025

‘మట్కా’ నుంచి పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ టీజర్..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం మట్కా కోసం ఇంతకు ముందు చేయని ప్రయత్నం చేశాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకుడు. ఈ సినిమా మట్కా కింగ్‌గా ఎదిగిన ఒక సాధారణ వ్యక్తి యొక్క ప్రయాణాన్ని వివరిస్తుంది. విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో మట్కా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “నేను గద్దల కొండ గణేష్ సినిమా చేశాక అలాంటి సినిమాలు చేయాలని చాలా మంది అడిగారు. నానుంచి అలాంటి సినిమా ఆశించే వారి కోసం మట్కా వుంటుంది. మాస్, ఫైట్స్ కాకుండా 1960లో వైజాగ్ లో జరిగే కథను టీజర్‌లో కొంత చూశారు.  ట్రైలర్ తర్వాత కథ గురించి ఇంకా విషయాలు తెలుస్తాయి”అని అన్నారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో వరుణ్‌ని ఇప్పటివరకు చూడని విధంగా చూస్తారు. నవంబర్ 14న థియేటర్‌లో సినిమా చూడండి” అని తెలిపారు. నిర్మాత రజనీ తాళ్లూరి మాట్లాడుతూ.. “ఈ సినిమా కథను దర్శకుడు… వరుణ్ తేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రాశారు. వరుణ్ చాలా బాగా చేశారు. ఇందులో 6 సాంగ్‌లు, 9 ఫైట్లు వున్నాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత డా. విజయేందర్ రెడ్డి తీగల, కెమెరామెన్ కిషోర్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News