Friday, November 22, 2024

మత్స్య సొసైటీలు 647 నుంచి 5112కు పెంచాం: శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసన సభలో తలసాని మీడియాతో మాట్లాడారు. దేశంలో సబ్సిడీపై రొయ్య పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. 2021-22లో 4.4 టన్నుల చేపల ఉత్పత్తిని లక్షంగా పెట్టుకున్నామని, 3.89 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించామన్నారు. 2022-23లో 4.57 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నామని తెలిపారు. 2021-22లో 23,263 నీటి వనరుల్లో చేప పిల్లలు విడుదల చేశామని తలసాని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 23748 నీటి వనరుల్లో చేప పిల్లలు విడుదల చేశామని, చేప పిల్లల మార్కెటింగ్ కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, గతంలో 647 సొసైటీలు ఉండగా ప్రస్తుతం 5112కు పెంచామన్నారు. ఈ ఏడాది కొత్తగా లక్ష మందికి సభ్యత్వం ఇచ్చామని తలసాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News