Tuesday, April 8, 2025

ఫైనల్ మ్యాచ్‌కి ముందు కివీస్‌కి షాక్?

- Advertisement -
- Advertisement -

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో టీం ఇండియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ ఆసక్తికర పోరులో విజయం సాధించి ట్రోఫీని దక్కించుకోవాలని ఇరు జట్లు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కి ముందు న్యూజిలాండ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లీగ్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఈ ఫైనల్‌ మ్యాచ్‌కి దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో క్లాసన్ క్యాచ్‌ని అందుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయం అయింది.

దీంతో అతను ఫైనల్ మ్యాచ్ అడుతాడా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. అతను ఆడకపోతే.. అది న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. అయితే హెన్రీ రాకపై కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాత్రం నమ్మకంతోనే ఉన్నాడు. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నాడని.. మ్యాచ్ సమయానికి అతను సిద్ధం అవుతాడని శాంట్నర్ అంటున్నాడు. కానీ, కోచ్ గ్రే స్టేడ్ మాత్రం హెన్నీ విషయం ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ‘‘హెన్రీ కోలుకుంటాడని ఆశిస్తున్నాం. కొన్ని స్కాన్లు కూడా చేయించాం. కానీ, ఇప్పుడే ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం’’ అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News