Friday, December 20, 2024

తన మొదటి గేర్డ్‌ ‘ఇవి’మోటార్‌బైక్‌కు ఎరా (ఎఇఆర్‌ఎ)ను లాంచ్ చేసిన మేటర్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇన్నోవేషన్‌–లీడ్‌ టెక్‌ స్టార్ట్‌–అప్‌ అయిన మేటర్, మారుతున్న ధోరణులకు అనుగుణంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన మోటార్‌బైక్‌కి ఎరా (ఎఇఆర్‌ఎ) అని పేరు పెట్టింది. సాటిలేని సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవి) వృద్ధిని స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించడం మేటర్‌ లక్ష్యం.

మేటర్‌ ఎరా వేరియంట్‌లు ఎరా (ఎఇఆర్‌ఎ)4000, ఎరా(ఎఇఆర్‌ఎ)5000 ఎరా(ఎఇఆర్‌ఎ) 5000+, ఎరా(ఎఇఆర్‌ఎ) 6000+ పేర్లతో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా ఏకరీతి ప్రీ రిజిస్టర్‌ ధరలతో ఎరా (ఎఇఆర్‌ఎ)5000 రూ.1,43,999 లక్షలు, ఎరా (ఎఇఆర్‌ఎ)5000కు రూ.1,53,999లక్షలుగా ఉండనుంది.

ప్రీ–రిజిస్టర్‌ ధరలు కేంద్ర ప్రభుత్వాల సబ్సిడీలు, జిఎస్టీ స్లాబ్‌ల మద్దతును పరిగణనలోకి తీసుకుంటాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సమయంలో కస్టమర్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. మేటర్‌ 5kWh & 6kWh. బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇంకా, ఎరా (ఎఇఆర్‌ఎ) 6000+ త్వరలో 6kWh బ్యాటరీ ప్యాక్‌తో ప్రారంభించబడుతుంది.

సమకాలీన స్పోర్టీ లుక్స్‌తో, అత్యాధునిక సాంకేతికతతో ఇది రూపొందింది. అత్యాధునిక ఇన్‌బిల్ట్‌ లిక్విడ్‌–కూల్డ్‌ బ్యాటరీ ప్యాక్‌లతో శక్తివంతమైన మేటర్‌ ఎరా (ఎఇఆర్‌ఎ) కేవలం మోటర్‌బైక్‌ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. ఇది 22వ శతాబ్దానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్న మోటార్‌ బైక్‌.

మేటర్‌ ఎరా (ఎఇఆర్‌ల) ఎలక్ట్రిక్‌ మోటార్‌బైక్‌లో మాన్యువల్‌ గేర్‌ షిఫ్టింగ్‌ను చేర్చడం ద్వారా ఇప్పటికే ఉన్న నమూనాలకు స్థాన చలనం కలిగిస్తుంది అందుబాటు ధరలోనే థ్రిల్లింగ్‌ పనితీరును అందించడం ద్వారా వైవిధ్యంతో సవాలు విసురుతుంది.

మేటర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, సిఇఒ అయిన మోహల్‌లాల్‌భాయ్‌ ఇలా అన్నారు నిజంగా ‘ఎరా (ఎఇఆర్‌ఎ) మా థృక్పధాన్ని మార్పుకు ప్రతినిధిగా సూచిస్తుంది, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా యథాతథ స్థితిని సవాలు చేస్తుంది. మేం ఈవి రంగంలో అంచనాలను తలకిందులు చేసే మార్పులను రూపొందించడానికి మాత్రమే ప్రయత్నించలేదు. భారతదేశంలో ఈవి స్థిరమైన మొబిలిటీ కోసం విస్త్రుత వినియోగం కోసం మార్గాలను కూడా రూపొందించాలి.

అయితే మార్పును తీసుకురావడానికి వినియోగదారులు అధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉందని మేము అంగీకరించం. అందుకే, గత నాలుగు సంవత్సరాలుగా, స్క్రాచ్‌ నుంచి ఒక ఉత్పత్తిని మేటర్‌ నిర్మించింది. ఏకీకరణను దాని ప్రధాన విధానంగా స్వీకరించింది. తన వినియోగదారుల అమూల్యమైన అభిప్రాయాన్ని అందులో పొందుపరిచింది.ఈ రోజు అత్యంత ఆధునికమైన మోటార్‌బైక్, ఎరా (ఎఇఆర్‌ఎ)ను తోటి దేశస్థులందరికీ ఎంచుకోవడానికి పలు ఎంపికలతో పాటుగా ఆసక్తికరమైన ధరకు అందుబాటులో ఉంచడం పట్ల చాలా సంతోషిస్తున్నాము. ఎరా (ఎఇఆర్‌ఎ) రూపకల్పన సాంకేతికత పట్ల వారి ప్రతిస్పందన, ప్రశంసలకు గాను మోటార్‌బైకర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోటర్‌బైకర్లు మేటర్‌తో పాటు అడుగు వేస్తారు కాబట్టి, ఈవిల దిశగా పెను మార్పుకు ఒక ఇరుసుగా ఇది ఉంటుందని భావిస్తున్నాం.

మేటర్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు సిటిఒ కుమార్‌ ప్రసాద్‌ తెలికేపల్లి ఇలా అన్నారు ‘‘మేటర్‌ ద్వారా కొత్త మొబిలిటీ రూపాలు, అనుభవాలను రూపొందించడానికి సాంకేతికత ఆవిష్కరణలతో నిరంతరం పని చేయాలనుకుంటున్నాము, మా విలువలకు నిజమైన ప్రాతినిధ్యంగా ఎరా (ఎఇఆర్‌ఎ)అందించడానికి సంతోషిస్తున్నాము మా కస్టమర్‌లకు ఎరా (ఎఇఆర్‌ఎ) ద్వారా సాంకేతిక లక్షణాల శ్రేణి చేరువవుతుంది. మొబిలిటీకి తీరైన మార్గాలను అవలంబించడానికి, విస్త్రుత వినియోగానికి… వినియోగదారులకు ఎరా (ఎఇఆర్‌ఎ) సహకరిస్తుంది, మేం భారతీయ భౌగోళిక వాతావరణ పరిస్థితులకు సరిపోయే ఉత్పత్తిని సృష్టించాం. సాంకేతిక ఆవిష్కరణల ద్వారా. ఎల్లప్పుడూ కొత్త ఉత్పత్తులు అనుభవాలను రూపొందించడానికి మా బృందాల లోతైన ఆలోచన ప్రక్రియ కృషి చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News