Saturday, November 23, 2024

కుండలో నీరు తాగితే ఎన్ని లాభాలో మీకు తెలుసా?

- Advertisement -
- Advertisement -

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా నీరు తాగడానికి ప్రయత్నిస్తారు. నీరు ప్రతీ రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పది సంవత్సరాల లోపు పిల్లలు అయితే రెండు లీటర్ల లోపు నీళ్ల తాగవచ్చు. నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రిజ్ నీరుతో పోలిస్తే కుండలో నీరు తాగితే చాలా లాభాలు ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడుతుంది. కుండలో నీరు తాగడంతో వేడి చేయదు.
కుండలను బంకమట్టితో తయారు చేస్తారు, మట్టిలో సహజంగానే ఆల్కలీన్ ఉంటుంది కావునా పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది.

నీటిలో సహజ సిద్ధమైన ఖనిజాలు ఉండడంతో జీవక్రియ అనేది పెరుగుతోంది. బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కుండలోని మలినాలు సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. మంటి కుండలో సహజ ఖనిజాలు ఉండడంతో రసాయనాలు కనిపించవు. మంటి కుండలో నీరు తాగితే మలబద్ధకం, వేడి, కంటి సమస్యలు, చికాకు, దురద వంటి సమస్యలు నుంచి దూరంగా ఉంటాము. మట్టి కుండలోని నీరు తాగడంతో గాయమైనప్పుడు త్వరగా మానుతాయి. గాయాల ఉంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ కూడా తగ్గిస్తాయి. రిఫ్రిజరేటర్స్‌లోని నీళ్లు తాగి గొంతు సమస్యలతో పాటు అతి చల్లగా ఉండడంతో శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News