Sunday, November 24, 2024

మారిషస్‌లో సోషల్ మీడియా సైట్లపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 10న పార్లమెంటరీ ఎన్నికలకు ముందు సోషల్ మీడియా వెబ్‌సైట్లకు వెసులుబాటును మారిషస్ ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. ఈ ఎన్నికల్లో రెండవ విడత అధికారంలోకి రావాలని ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ ఆశిస్తున్నారు. దేశ కమ్యూనికేషన్ల నియంత్రణ సంస్థ ఐసిటి ఆ ఆదేశాన్ని ప్రకటించింది. ఎన్నికల మరునాడు అంటే 11 వరకు సోషల్ మీడియా సైట్లను నిషేధించనున్నట్లు ఐసిటి తెలియజేసింది. దేశాన్ని క్రితం నెల కుదిపివేసిప ఫోన్‌ట్యాపింగ్ కుంభకోణం నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడమైంది. రాజకీయ నాయకుల, వాణిజ్య ప్రముఖులు, సివిల్ సొసైటీ సభ్యులవి రికార్డు చేసిన సంభాషణలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ లీక్‌లు దేశ భద్రతకు ముప్పు అని మారిషస్ ప్రభుత్వం అన్నది. సోషల్ మీడియాకు వెసులుబాటును సస్పెండ్ చేయవలసిందని కమ్యూనికేషన్ల ప్రాధికార సంస్థను ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News