Sunday, December 22, 2024

‘మావా ఎంతైనా పర్లేదు బిల్లు..’ ఫుల్ సాంగ్ విడుదల(వీడియో)

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. ’అతడు’, ’ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ హిట్ సినిమాల తర్వాత రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, సాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘మావా ఎంతైనా పర్లేదు బిల్లు..’ అనే సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. రమాజోగయ్య శాస్త్రీ రచించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదల పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇక, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో మంగళవారం రాత్రి జరిగింది. ఈ మూవీ సంక్రాంతి పండక్కి బ్లాక్ బస్టర్ అవుతుందని.. ఈ సినిమాలో తనలోని కొత్త కోణాన్ని చూస్తారని మహేష్ బాబు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News