Tuesday, January 21, 2025

ఏనుగు దాడిలో మావటి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ జూ పార్క్‌లో విషాదం

మనతెలంగాణ/ రాజేంద్రనగర్: విధి నిర్వహణలో గజరాజు ఆగ్రహానికి ఓ జంతు సం రక్షుడు ప్రాణాలను విడిచాడు. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు.. మావటిపై దాడి చేయడంతో అతడు మరణించాడు. శనివారం ఏనుగుల సఫారీలో డ్యూటీ చేస్తున్న షైబాజ్ (23)పై ఏనుగు దాడి చేసింది. దాడిలో షై బాజ్‌కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. జూ పార్క్ 60ఏళ్ల ఉత్సవంలో పాల్గొనేందుకు ఇతర ఉద్యోగులు వెళ్లగా, ఏనుగుల ఎన్ క్లోజర్‌లో షైబాజ్ ఒక్కడే విధుల్లో ఉన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News