Monday, December 23, 2024

సీనియర్ సిటిజన్ల డిపాజిట్ గరిష్ఠ పరిమితి రూ. 30 లక్షలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సీనియర్ సిటిజన్ల డిపాజిట్ గరిష్ఠ పరిమితి రూ. 30 లక్షలకు పెంచుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తొమ్మిదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామన్నారు. 47 లక్షల మంది యవజనులకు స్టైపెండ్ అందిస్తామని వివరించారు. మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికెట్ పథకం ఏర్పాటు చేశామని, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్ఘిక లోటు జిడిపిలో 5.9 శాతం ఉంటుందని అంచనా వేశామన్నారు. లిథియం బ్యాటరీల కోసం చేసుకునే దిగుమతులపై కస్టమ్స్ సుంకం మినహాయించామని నిర్మలా సీతారామన్ చెప్పారు.  ఫలితాల ఆధారంగా కేంద్ర పథకాలకు నిధులు కేటాయించామని, 5 జి సేవల యాప్‌ల అభివృద్ధికి వందరిశోధనా సంస్థలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కోర్టు ఏర్పాటుకు రూ.7 వేల కోట్ల నిధులు మంజూరు చేశామని, ఎంఎస్‌ఎంఇల, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవలు విస్తరిస్తామన్నారు. దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్, పరపతి సంఘాల డిజిటలైజేషన్‌కు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News