Friday, December 20, 2024

ప్రపంచ కప్ 2023: మ్యాక్స్ వెల్ @150

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ రెచ్చిపోయాడు. ఆఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 151 పరుగులు చేశాడు. 105 బంతుల్లో ఈ ఫీట్ ను సాధించాడు. కమిన్స్ అండతో ఒంటరి పోరాటం చేసిన మ్యాక్స్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.

ప్రస్తుతం 41 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆసీస్ 241 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్ వెల్(151), కమిన్స్(11)లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవాలంటే 58 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిఉంది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ 17 పోర్లు, 5 సిక్సులు కొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News