Sunday, January 19, 2025

ప్రపంచకప్ 2023: మ్యాక్స్ వెల్ సూపర్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ అద్భుత శతకం చేశాడు. 76 బంతుల్లో మ్యాక్స్ వెల్ సెంచరీ రాబట్టాడు. కమిన్స్ అండతో మ్యాక్స్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు ఆఫ్ఘానిస్థాన్ బౌలర్లు షాకిచ్చారు.

292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆఫ్ఘాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు చేరారు. ఈ మ్యాచ్ లో మాక్స్ వెల్ నిలకడగా ఆడుతూ స్కోర్ ను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. దీంతో 32 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రీజులో మాక్స్ వెల్(104), కమిన్స్(8)లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవాలంటే 97 పరుగులు కావాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News