Monday, January 20, 2025

విండీస్ పై మ్యాక్స్‌వెల్ విధ్వంసకర సెంచరీ.. రోహిత్ రికార్డు సమం

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్.. మ్యాచ్ ఏదైనా.. జట్టు ఏదైనా తన విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు తన పేరిట రాసుకుంటున్నాడు 35ఏళ్ల మ్యాక్స్‌వెల్. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు మ్యాక్సీ. రోహిత్.. అంతర్జాతీయ టీ20లో ఐదు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆదివారం విండీస్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపెడుతూ మ్యాక్సీ(120 పరుగులు) మరో అద్భుత సెంచరీ సాధించాడు. దీంతో విండీస్ పై ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. ఈ సెంచరీతో టీ20ల్లో ఐదో సెంచరీ సాధించి రోహిత్ సరసన నిలిచాడు మ్యాక్స్‌వెల్.

కాగా, రోహిత్ శర్మ 143 ఇన్నింగ్స్ ఐదు సెంచరీలు సాధించగా.. మ్యాక్స్‌వెల్ 94 ఇన్నింగ్స్ లోనే సాధించాడు. వీరి తర్వాత టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్.. కేవలం 57 ఇన్నింగ్స్ లో నాలుగు సెంచరీలు పూర్తి చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News