Monday, December 23, 2024

పారిశుద్ధ్య కార్మికులకు మే డే కానుక..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మే డే కానుక ఇచ్చింది. సోమవారం కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పారిశుద్ధ్య కార్మికులకు తీపి కబురు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.వెయ్యి వేతనం పెలచాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

దీంతో జిహెచ్‌ఎంసి, జలమండలి పారిశుద్ధ్య కార్మికులతో సహా రాష్ట్రవ్యాప్తంగా 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెరగనున్నాయి. పెరగనున్న వేతనాలు పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే అమలు కానున్నాయి. వీరితోపాటు ఆర్టీసి కార్మికుల వేతనాలు కూడా పెంచాలని, వేతనాల పెంపుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు సిఎం కెసిఆర్ అదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News