Wednesday, January 22, 2025

నేనే సిఎంను అవుతానేమో

- Advertisement -
- Advertisement -

జానారెడ్డి సంచలన వ్యాఖ్య

మనతెలంగాణ/హైదరాబాద్/ గుర్రంపోడు : ‘నేను పదవుల రేసులో లేను..కాని పదవులే రేసులో ఉండి నన్ను అందుకుంటాయి’ అని సీనియర్ కాంగ్రెస్ నేత జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పివి. నరసింహారావు ప్రధానమంత్రి ఎలా అయ్యారో అలాగే నేను కూడా ముఖ్యమంత్రి అవచ్చు. 6 నెలల్లో పదవిలోకి రావడానికి నా కొడుకు రాజీనామా చెస్తాడు, నేను పోటీ చేసి గెలు స్తా. అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశా రు. మంగళవారం గుర్రంపోడులో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జానారెడ్డి ఈ వ్యా ఖ్యలు చేశారు. కొంతమంది జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ నేను ఏ పదవిని కోరుకోవడం లేదు, పివి ప్రధానమంత్రి ఎలా అయ్యారో అట్లనే నాకు కూ డా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చు అని ఆయనన్నారు. 21 ఏ ళ్ళకే రాజకీయాల్లోకి వచ్చానని, 36 ఏళ్ళకే మంత్రి నయ్యానని, తనకు 55 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News