- Advertisement -
- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు: బక్రీద్ పండుగ పురస్కరించుకొని స్థానిక ముస్లిం సోదరులకు గురువారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ముస్లిం సోదరుల కుటుంబాలకు బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. బక్రీద్ పురస్కరించుకొని స్థానిక ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగన్నారు. మిని ఇండియాగా పేరున్న పటాన్‌చెరులో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులున్నారన్నారు. వారందరికీ సముచిత స్తానం కల్పిస్తున్నట్టుగా చెప్పారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ అందజేస్తున్న షాదీ ముబారక్ పేద ముస్లిం కుటుంబాలకు అందిస్తున్నట్టుగా చెప్పారు. వారి సంక్షేమం కోసం తన వంతుగా సహాయ సహకారలు అందజేస్తున్నట్టుగా తెలిపారు.
- Advertisement -