Monday, January 6, 2025

‘మాయా పేటిక’ ట్రైల‌ర్‌కి అమేజింగ్ రెస్పాన్స్‌..

- Advertisement -
- Advertisement -

విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’. రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ మూవీ జూన్ 30న గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ట్రైల‌ర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. టీజ‌ర్‌, పాట‌ల‌ు సినిమాపై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచగా.. తాజాగా ట్రైలర్, మూవీపై అంచనాలు నెలకొనేలా చేసింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మాయా పేటిక చిత్రాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి స్మార్ట్ ఫోన్ థ్రిల్ల‌ర్ కథాంశంతో రూపొందించాం . ద‌ర్శ‌కుడు ర‌మేష్ రాపర్తి అస‌లు నేటి ప్ర‌పంచంలో స్మార్ట్ ఫోన్ ఎంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. దాని చుట్టూ ప్ర‌పంచం ఎలా తిరుగుతుంద‌నే విష‌యాల‌ను చెబుతూనే స్మార్ట్‌ఫోన్ వ‌ల్ల జీవితాలు ఎలా త‌ల‌కిందుల‌వుతాయ‌నే విష‌యాన్ని ఎంట‌ర్‌టైనింగ్‌గా చెబుతూనే మంచి మెసేజ్‌ను అందించారు. ఇక మేకింగ్‌లో మేం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమా చాలా రిచ్‌గా వ‌చ్చింది. ఈ సినిమాలో స్మార్ట్ ఫోన్ హీరో. త‌నే ఈ క‌థ‌ను అంద‌రికీ చెబుతుంది. అంద‌రి జీవితాల్లో త‌నొక భాగంగా ఎలా మ‌రిపోయాన‌నే విష‌యాన్ని త‌నే వివ‌రించ‌ట‌మే ఈ సినిమా స్పెషాలిటీ. అదెలా ఉంటుంద‌నేది తెర‌పై చూడాల్సిందే. గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ సంగీతం, నేప‌థ్య సంగీతం, సురుష్ ర‌గుతు విజువ‌ల్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్‌గా నిలుస్తాయని’’ అన్నారు.

Also Read: ‘సామజవరగమన’ ట్రైలర్ విడుదల..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News