Saturday, March 29, 2025

టైగ్రస్ మాయా మృతి; ఎంపి సంతోష్ విచారం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు చెందిన ఆడపులి టైగ్రస్ మాయా మరణించింది. పదమూడేళ్ల వయసున్న టైగ్రస్ మాయా కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అటవీ సిబ్బంది గాలింపు చేపట్టారు. మూడు రోజుల అనంతరం టైగ్రెస్ మాయా కళేబరం కనిపించింది. మాయాది సహజ మరణమేనని అటవీ సిబ్బంది భావిస్తున్నారు. కాగా టైగ్రస్ మాయా మృతి పట్ల బిఆర్ఎస్ ఎంపి సంతోష్ కుమార్ తీవ్ర విచారం వెలిబుచ్చారు. తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్టు సందర్శకులకు టైగ్రస్ మాయా కనువిందు చేసేదని, మాయా జ్ఞాపకాలు సందర్శకులకు చిరకాలం గుర్తుండిపోతాయని ఆయన ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News