Wednesday, January 22, 2025

మాయల మరాఠి ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : అధికార దాహం కోసం పూటకో మాటతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్న మాయల మరాఠి, అబద్దాలకోరు ముఖ్యమంత్రి కెసిఆర్ అని ముథోల్ నియోజకవర్గ బిజెపి కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లే మోహన్ రావు పటేల్ మండల బిజెపి నాయకులతో కలిసి పల్లె పల్లెకు బిజెపి గడపగడపకు మోహన్ రావు

మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను నిర్వ హించారు. ముందుగా గ్రామంలోని పార్టీ జెండాను ఆవిష్కరించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే కాలమాన సూచికలను ఇంటింటికి అందజేశారు. అనంతరం నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించిన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు లక్షరూపాయల రుణమాఫీ,మిషన్ కాకతీయ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ నిరుద్యోగ భృతి, తదితర హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఇంట్లోనే గెలవని వారు రచ్చ గెలిచినట్టు రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కెసిఆర్ దేశాన్ని పాలిస్తాననడం హస్యా స్పదమన్నారు.

మహిళలను వేదింపులకు గురిచేస్తూ రౌడీయిజంతో యథేచ్చగా భూములు లాక్కుంటున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్ని ంచిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్న కులాలను దూషిస్తున్న ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి పెట్టి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమాల పేరుతో ఇష్టారీతిలో కరెంటు బిల్లుల బస్సు చార్జీలు పెంచిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి వర్తిస్తుందని అన్నారు. మండల ప్రజలు ఇకనైనా కళ్లు తెరవాలని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాని గద్దెదించి మతోన్మాద శక్తుల ను అణచివేస్తూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం ఆరాటపడే బిజెపి ప్రభుత్వాన్ని గెలుపించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల భాజపా నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News