Wednesday, January 22, 2025

ఇండియా-ఎ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

ముంబై: దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌లో పాల్గొ నే జట్లను బిసిసిఐ ఎంపిక చే సింది. ఇండియా ఎ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. తొలి రౌండ్‌లో సారధిగా వహించిన శుభ్‌మన్ గిల్ టీమిండియాకు ఎంపిక కావడం తో అతని స్థానంలో మయాంక్‌కు సారథ్య బాధ్యతలు ఎంపిక చేశారు. దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ఎ, బి, సి, జట్లను ప్రకటించారు.

బంగ్లాదేశ్‌తో జరి గే సిరీస్‌కు ఎంపికైన శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ తదితరులు దులీప్ ట్రోఫీ నుంచి వైదొలిగారు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించారు. రింకు సింగ్, సుయాశ్ ప్రభ్‌దేశాయ్‌లకు చోటు దక్కింది. సూర్యకుమార్ పూర్తి ఫిట్‌నెస్ సాధించక పోవడంతో అతన్ని ఎంపిక చేయలేదు. ఎ జట్టుకు మయాంక్, బి టీమ్‌కు అభిమన్యు, సి జట్టుకు రుతురాజ్, డి టీమ్‌కు శ్రేయస్ అయ్యర్‌లు సారథ్యం వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News