Wednesday, January 22, 2025

మయాంక్ అగర్వాల్ కు తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. రంజీ ట్రోపీలో కర్నాటక జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లెందుకు విమానం ఎక్కాడు. అతనికి కేటాయించిన సీటులో కూర్చున్న వెంటనే తీవ్రమైన గొంతు నొప్పితో వాంతులు చేసుకున్నాడు. దీంతో మయాంక్‌ను వెంటనే అగర్తలలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఐసియులో చికిత్స పొందుతున్న అగర్వాల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News